బన్నీని అన్ ఫాలో చేసిన సాయితేజ్.. వివాదం ముదిరిందా..?

బన్నీని అన్ ఫాలో చేసిన సాయితేజ్.. వివాదం ముదిరిందా..?

 

గత కొంత కాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సోసల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ కు మెగా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేసింది. రామ్ చరణ్ స్వయంగా పిఠాపురం వెళ్లి మరీ పవన్ కోసం ప్రచారం చేశాడు. 

ఆయనతో పాటు సాయితేజ్, వరుణ్‌ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా వెళ్లి ప్రచారం చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కల్యాణ్‌ తరఫున ప్రచారం చేయలేదు. కానీ నంద్యాల వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవిచంద్రారెడ్డికి మాత్రం సపోర్ట్ చేశాడు. దాంతో అల్లు అర్జున్న మీద మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బన్నీకి విశ్వాసం లేదంటూ మండిపడ్డారు.

అయితే బన్నీ అవేమీ పట్టించుకోలేదు. ఇక మొన్నటి ఫలితాల్లో కూటమి భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. దాంతో అల్లు అర్జున్ ను అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ కూడా బన్నీని ఏ ఈవెంట్ కు పిలవట్లేదు. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ బన్నీని సోషల్‌ మీడియాల్లో అన్ ఫాల్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. దాంతో వివాదం మరింత ముదిరిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Posts