‘వార్-2’లో ఎన్టీఆర్‌కు జతగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్

‘వార్-2’లో ఎన్టీఆర్‌కు జతగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్

ఎన్టీఆర్‌ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్-2’కు సంబంధించి తారాగణం ఎంపిక పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ఎన్టీఆర్‌తో జతకట్టనుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఏ మాత్రం నిరాశపర్చడం లేదు. ఇప్పటికే డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో ‘దేరవ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఎన్టీఆర్‌ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్-2’కు సంబంధించి తారాగణం ఎంపిక పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో తారక్‌ నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ఎన్టీఆర్‌తో జతకట్టనుంది. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. జూలై చివరి వారంలో అలియా భట్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Related Posts