నీచ రాజకీయాలతో రామోజీరావుకు ఎన్నో అవమానాలు: నటుడు రాజేంద్రప్రసాద్
నీచ రాజకీయాలతో రామోజీరావు ఎన్నో అవమానాలు అనుభవించారని టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూయగా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
నీచ రాజకీయాలతో రామోజీరావు ఎన్నో అవమానాలు అనుభవించారని టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూయగా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
ఈ చెత్త రాజకీయాల వల్ల రామోజీరావు పడిన అవమానాలు భగవంతుడు చూశాడని తెలిపారు. అందుకే రామోజీరావును అవమానించిన వారి పతనం చూసిన తర్వాతే దైవ సన్నిధికి వెళ్లారని అన్నారు. ఆయన అనుకున్నది సాధించి ఆనందంగా వెళ్లారని తెలిపారు. ప్రపంచం ఉన్నంత వరకు రామోజీరావు బతికి ఉంటారని అన్నారు. చరిత్రలో నిలిచిపోతారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.
రామోజీరావు ఈ నీచ రాజకీయాల వల్ల అవమానాలు అనుభవించారు..
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2024
కానీ ఒకటి మాత్రం నిజం ఆయనను వేధించిన వారి పతనాన్ని చూశాకే ఆయన దైవ సన్నిధికి వెళ్ళాడు - నటుడు రాజేంద్రప్రసాద్ pic.twitter.com/raHpKcu9zt