ఆమెలోనే ఏదో లోపం.. కర్ణాటక హైకోర్టు ఆగ్రహం

ఆమెలోనే ఏదో లోపం.. కర్ణాటక హైకోర్టు ఆగ్రహం

 ఆరు పెళ్లిళ్లు చేసుకుని విడాకులిచ్చిన మహిళ
ఏడో భర్త నుంచి విడాకులు కావాలంటూ మరోసారి  తాజాగా కోర్టుకు
ప్రతిసారీ భర్త, అత్తమామలపై గృహహింస కేసులు తో పిర్యాదు 
ఆమెలోనే ఏదో లోపం ఉందన్న కర్ణాటక  న్యాయస్థానం

హైద్రాబాద్ , విశ్వంభర :- భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన మహిళ పిటిషన్‌ను చూసిన న్యాయమూర్తి తొలుత ఆశ్చర్యపోయారు. ఆపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల మహిళ భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది.

విచారణ సందర్భంగా ఆమె భర్త వినిపించిన వాదనలు విని న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. తాను ఆమెకు ఏడో భర్తనని, శ్రీమంతులను చూసి పెళ్లి చేసుకోవడం, ఆపై ఏదో ఒక సాకు చెప్పి విడాకులు తీసుకోవడం చేస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె మోసం బయటపడింది.

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

గత ఆరేళ్లలో ఆమె ఆరుగురిని పెళ్లాడింది. ఆరు నెలల తర్వాత అత్తింటి వారిపైనా, భర్తపైనా గృహహింస కేసులు పెట్టేది. రాజీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసేది. దీంతో వారు గత్యంతరం లేక అడిగినంత ఇచ్చి బతుకు జీవుడా అని తప్పుకునేవారు. ఇలా ఇప్పటికే ఆరుగురికి విడాకులిచ్చింది. 

తాజాగా, ఏడో భర్తపైనా కోర్టుకెక్కగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడమంటే అందులో మీ తప్పే కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు.

Tags: