స్పేస్‌స్టేషన్‌లో బ్యాక్టీరియా.. ప్రమాదకర పరిస్థితుల్లో సునీతా విలియమ్స్
అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఎనిమిది మంది ఆస్ట్రోనాట్స్ పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఎనిమిది మంది ఆస్ట్రోనాట్స్ పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పేస్ స్టేషన్‌లో బ్యాక్టీరియా ఉండటమే ఇందుకు కారణంగా ఈ బ్యాక్టీరియాను స్పేస్‌బగ్‌గా పిలుస్తారు. ఈబ్యాక్టీరియా మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ కావడంతో ఆ పేరు పెట్టినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంటిరోబ్యాక్టర్ బుగండెన్సిస్ అనే బ్యాక్టీరియా అంతరిక్ష కేంద్రంలో ఉన్నట్లు గుర్తించారు.
ఇది స్పేస్‌లో సాధారణంగా ఉన్న బ్యాక్టీరియా కాదని, వ్యోమగాముల ద్వారా అక్కడికి చేరి ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్పేస్ స్టేషన్ వాతావరణాన్ని ఆ బ్యాక్టీరియా తట్టుకుంటోందని తెలిపారు.. ఈ బ్యాక్టీరియా వ్యోమగాముల ఊపిరితిత్తులకు సోకే అవకాశం ఉన్నదని వెల్లడించారు. కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్సన్ ల్యాబ్‌లో పనిచేస్తున్న డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ స్పేస్ స్టేషన్ బ్యాక్టీరియాపై అధ్యయనం చేస్తున్నారు. అంతరిక్ష కేంద్రానికి సునీతా విలియమ్స్‌తో పాటు బారీ యూజీన్ వ్యోమగామి ఇద్దరూ జూన్ 6, 2024న చేరుకున్నారు. మిగతా ఏడుగురు సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు.