దారుణం.. కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి

దారుణం.. కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి

వీధికుక్కల దాడిలో పిల్లలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కంటికి పాపలా కాపాడుకుంటున్న పిల్లలను కుక్కలు పీక్కుతినేస్తున్నాయి. తాజాగా మరో విషాద ఘటన వెలుగుచూసింది.

వీధికుక్కల దాడిలో పిల్లలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కంటికి పాపలా కాపాడుకుంటున్న పిల్లలను కుక్కలు పీక్కుతినేస్తున్నాయి. తాజాగా మరో విషాద ఘటన వెలుగుచూసింది. జనగామ జిల్లాలలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా చిల్పూర్ మండలం నునావత్ తండాలో గుగులోత్ మధు, సరిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు గుగులోత్ శివరామ్(6) ఉన్నాడు. అయితే ఎప్పటిలాగే ఇంటి వద్దే పిల్లాడిని ఉంచి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. 

అయితే తిరిగి వచ్చి చూసేసరికి బాలుడిజాడ కనిపించలేదు. సమీపంలో కుక్కల అరుపులు వినిపిస్తుండటంతో వెళ్లి చూసే సరికి వారి గుండె పగిలినంత పనైంది. చెట్ల పొదల్లో బాలుడు పడి ఉండగా అప్పటికే కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయాలపాలై మృతిచెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లముందు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి