బాలికపై తండ్రి లైంగికదాడి.. ఒప్పుకోకపోవడంతో దారుణ హత్య

బాలికపై తండ్రి లైంగికదాడి.. ఒప్పుకోకపోవడంతో దారుణ హత్య

 

 

రోజురోజుకూ దారుణాలు వెలుగుచూస్తున్నాయి. వావి వరసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరు అయితే ఏకంగా సొంత కూతుర్లమీదనే లైంగిక దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి దారుణమై వెలుగు చూసింది. హైదరాబాద్ మియాపూర్ లోని బాలిక మర్డర్ కేసులో ఇప్పుడు ఓ భయంకరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 

అసలు బాలిక వంసతను ఆమె కన్నతండ్రే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆమెను తన ఇంటికి సమీపంలోని నడిగడ్డ తండాకు తీసుకెళ్లాడు. అక్కడ తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. దాంతో ఆ బాలిక భయపడి అరిచింది. తల్లికి చెప్తానంటూ బెదిరించడంతో.. క్షణికావేశానికి గురైన ఆమె తండ్రి.. నేలకేసి బాది చంపేశాడు. 

మియాపూర్ లో నివాసం ఉంటున్న నరేష్ ఈ మధ్య పోర్న్ వీడియోలకు వాటికి బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే తన కూతురు మీద కన్నేశాడు. అయితే బాలిక ఒప్పుకోకపోవడంతో ఇలా చంపేశాడు. కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే ఆమెను చంపేశాడు. ఆ తర్వాత పొదల్లో నుంచి బయటకు వచ్చాడు. ఇంకసారి వెళ్లి చనిపోయిందా లేదా అని చూశాడు. 

ఆ తర్వాత కూడా మూడు రోజుల పాటు వెళ్లి కూతురు డెడ్ బాడీని చూస్తూ వచ్చాడు. ఇక నరేష్ దంపతులు తమ కూతురు మిస్ అయినట్టు కంప్లయింట్ ఇచ్చారు. పోలీసుల విచారణలో ఇంటి సమీపంలోనే డెడ్ బాడీ లభ్యం అయింది. అయితే తండ్రి మీద అనుమానం రావడంతో తమదైన స్టైల్ లో విచారించారు పోలీసులు. దాంతో నిజం ఒప్పుకున్నాడు నరేష్‌. వారం రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ మిస్టరీ బయటపడింది. మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండా అని తెలిపారు. బ్రతుకుదెరువు కోసం నరేష్ కుటుంబం నడిగడ్డ తండాకు వలసవచ్చింది. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును హత్య చేశాడు కసాయి తండ్రి. ప్రస్తుతం నరేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.