విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి.. 4గంటలు స్తంభంపైనే మృతదేహం
కరెంట్ స్తంభం ఎక్కిన ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే విద్యుత్ సిబ్బంది ఆలస్యంగా స్పందించారు. దీంతో నాలుగు గంటల పాటు అతడి మృతదేహం స్తంభంపైనే ఉంది.
కరెంట్ స్తంభం ఎక్కిన ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే విద్యుత్ సిబ్బంది ఆలస్యంగా స్పందించారు. దీంతో నాలుగు గంటల పాటు అతడి మృతదేహం స్తంభంపైనే ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణం పోయిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడ గ్రామంలో విద్యుత్ మోటార్ కనెక్షన్ ఇవ్వడానికి మోతిరాం(38) అనే ఎలక్ట్రీషియన్ వెళ్లాడు. అతడు స్తంభం ఎక్కగానే విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మోతిరాం మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. సుమారు 4గంటల పాటు మృతదేహం స్తంభంపైనే ఉంది. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. మోతిరాం తమకు సమాచారం ఇవ్వకుండా కరెంటు పోల్ ఎక్కాడని తెలిపారు. చివరకు రూ.5లక్షల పరిహారం అందజేస్తామని విద్యుత్ శాఖ అధికారులు అంగీకరించారు.