అర్ధరాత్రి బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం..!

అర్ధరాత్రి బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం..!

 ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. మరో 24మందికి తీవ్రగాయాలయ్యాయి. అర్ధరాత్రి 1.30గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

హర్యానా నూహ్‌లోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం సంభవించింది.  ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. మరో 24మందికి తీవ్రగాయాలయ్యాయి. అర్ధరాత్రి 1.30గంటలకు ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టి బస్సులో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈలోపు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  

క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా పంజాబ్, చండీగఢ్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ బస్సు ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర నుంచి పంజాబ్‌లోని జలంధర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 60మంది ఉన్నారు. విద్యుదాఘాతం వల్ల బస్సులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Related Posts