రఘురామకృష్ణం రాజుకు స్పీకర్ పదవి..?
వైసీపీ రెబల్ ఎంపీగా సంచలనం సృష్టించిన రఘురామ కృష్ణం రాజు గురించి ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఆయన ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వైసీపీ నుంచి బీజేపీకి దగ్గరైన ఆయన.. ఆ తర్వాత ఎన్నికల ముందు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఉండి నియోజకవర్గం నుంచి టికెట్ తెచ్చుకుని మరీ గెలిచి చూపించారు.
అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇప్పుడు రఘురామ గెలవడం ఒక ఎత్తు అయితే కూటమి అధికారంలోకి రావడం మరో ఎత్తు అనే చెప్పుకోవాలి. దాంతో ఇప్పుడు రఘురామ కృష్నం రాజు పేరు తెరమీదకు వస్తోంది. కొత్త ప్రభుత్వంలో ఎవరికి మంత్రి పదవులు అనేది ఇప్పుడు అందరి చూపు.
అయితే మంత్రి పదవులు ఎవరికి వచ్చినా సరే గానీ.. రఘురామకు మాత్రం స్పీకర్ పదవి ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు వస్తోంది. ఎందుకంటే జగన్ మీద రఘురామకు పీకలదాకా కోపం ఉంది. కాబట్టి అసెంబ్లీలో జగన్ ను బాగా కంట్రోల్ చేస్తాడని.. అంతే కాకుండా ఇన్ని రోజులు రఘురామను జగన్ ఆర్డర్ వేస్తే... ఇప్పుడు జగన్ ను రఘురామ ఆర్డర్ వేస్తే చూడాలని ఉందంటున్నారు కూటమి నేతలు. మరి అందరూ కోరుతున్నట్టు రఘురామకు ఆ పోస్టు చంద్రబాబు ఇస్తారా లేదా అనేది చూడాలి.