మరోసారి బాలయ్యకు మొండిచేయి.. మంత్రి పదవి ఎందుకు ఇవ్వట్లేదు..?

మరోసారి బాలయ్యకు మొండిచేయి.. మంత్రి పదవి ఎందుకు ఇవ్వట్లేదు..?

 

నందమూరి బాలకృష్ణ.. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు. నందమూరి నటసింహం. తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన.. అగ్ర హీరోగా రాణిస్తున్నాడు. సినిమాల పరంగా పర్వాలేదనిపించుకుంటున్న ఆయనకు.. రాజకీయాల్లో మాత్రం పెద్దగా కలిసి రావట్లేదు. కేవలం ఎమ్మెల్యే స్థాయిలోనే ఆగిపోతున్నాడు బాలయ్య.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచినా.. చంద్రబాబు మంత్రి వర్గంలో ఆయనకు స్థానం దక్కలేదు. ఎమ్మెల్యే కాకపోయినా నారా లోకేష్ కు మాత్రం మంత్రి పదవి దక్కింది. కానీ బాలయ్యకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక రెండోసారి 2019 ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించాడు బాలయ్య. 

అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఇప్పుడు 2024లో మరోసారి హిందూపురం నుంచి గెలిచాడు. ఈసారి రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ సారి అయినా బాలయ్యకు మంత్రి పదవి దక్కుతుందేమో అని ఆయన అభిమానులు ఆశగా చూసినా.. చివరకు మొండి చేయి చూపించారు. చంద్రబాబు కేబినెట్ లో టీడీపీ నుంచి 20 మందికి మంత్రి పదవులు దక్కాయి.

లోకేష్ మరోసారి మంత్రి అయ్యాడు. కానీ బాలయ్యకు మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అసలు సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోనే బాలయ్య ఉన్నాడు కదా.. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నా ఆయనకు గుర్తింపు ఇవ్వట్లేదని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలో నందమూరి కుటుంబ సభ్యులకే ప్రధాన పాత్ర ఉండాలి గానీ.. ఆ విధమైన పాత్ర ఏ కోశాన కనిపించట్లేదని అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే.. ఎక్కడ పార్టీని లాగేసుకుంటారేమో అని ఇవ్వట్లేదా అని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ దీనిపై బాలయ్య మాత్రం మౌనంగానే ఉంటున్నాడు.

Related Posts