రిజల్ట్స్ తర్వాత జనసేన ఉండదు.. పవన్‌పై వేణు స్వామి జోస్యం!
ఏపీలో ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రచారం శైలి, పోలింగ్ సరళి చూసిన తర్వాత ఫలితాలను అంచనా వేయడం ఎవరితరం కావడం లేదు. అన్ని పార్టీ బయటకు ధీమాగా కనిపిస్తున్నా.. ఎక్కడో తెలియని భయాందోళనలో ఉన్నాయి. ఇక రాజకీయ విశ్లేషకులకు కూడా ఈసారి జరిగిన పోలింగ్ విధానం అంతుపట్టడం లేదు. దీంతో ఎవరు గెలుస్తారో అంత సులభంగా చెప్పలేక పోతున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక టెన్షన్ అయితే.. పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏంటీ అనే విషయంలో కూడా డబుల్ టెన్షన్ పట్టుకుంది.
ఏపీలో రాజకీయాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. మరోసారి జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబుకు రాజయోగం లేదని అన్నారు. ఇక పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటే మంచిదని చూపించారు. పవన్ ప్రభావం ఏపీలో ఉండదని చెప్పారు. పిఠాపురంలో కూడా ఆయన గెలవడం కష్టమేనని అన్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో ఓ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. అయితే.. ఆయన పార్టీ పేరు చెప్పలేదు. కానీ.. వేణు స్వామి చెప్పే విధానం బట్టి జనసేన ఉండదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా ఏపీ రాజకీయాలపై చాలా సార్లు జోతిష్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనను చాలా మంది ట్రోల్ చేశారు. మరి ఏపీ విషయంలో వేణుస్వామి జోతిష్యం నిజం అవుతుందో లేదో చూడాలి. ఆయన మాత్రం తన దగ్గరు ఉన్న జగన్, చంద్రబాబు, పవన్ జాతకాలు చూసి చెప్పానని అన్నారు. గ్రౌండ్ లో ఉండే రాజకీయాలు తనకు తేలియదని.. కేవలం రాశులు, నక్షత్రాలు చూసి మాత్రమే చెప్పానని అన్నారు.