రేపు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం

రేపు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

ఏపీలో ఇప్పుడు నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే బుధవారం, గురువారం కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. 

బుధవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల వైయస్ఆర్, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.