పవన్ కల్యాణ్‌ కు ఇచ్చిన శాఖలు ఇవే..

పవన్ కల్యాణ్‌ కు ఇచ్చిన శాఖలు ఇవే..

 

ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. అందరూ ఊహించినట్టుగానే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఇక అందరి చూపు పవన్ కల్యాణ్‌ మీదనే ఉండేది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించింది మాత్రం పవన కల్యాణ్‌ అని అందరూ ముందు ఉంచే ప్రచారం చేస్తున్నారు. దాంతో అసలు పవన్ కల్యాణ్‌ కు ఏ పదవి దక్కుతుందా అని ఎదురు చూడసాగారు.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

ఇక పవన్ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఇక తాజాగా ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్‌ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలు కేటాయించారు. చంద్రబాబు వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు ఉన్నాయి.

అయితే పవన్ కల్యాణ్‌ కు ఇలాంటి శాఖలు ఎందుకు కేటాయించారని ఆయన ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిలో ఉన్నారు. ఆయనకు పవర్ ఫుల్ శాఖలైన హోం శాఖ, విద్య, వైద్యం లాంటివి కేటాయిస్తే బాగుండేదని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆయనకు ఆల్రెడీ డిప్యూటీ సీఎం పదవి దక్కింది కాబట్టి ఈ శాఖలు కేటాయించినట్టు చెబుతున్నారు.

Related Posts