మెగా బ్రదర్స్ తో మోడీ అభివాదం.. సోషల్ మీడియా షేక్..!
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరిన వేల చాలా ప్రత్యేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై ఆత్మీయ ఆలింగనాలు, అభిమాన సంకేతాలు, ఘటనలు కనిపించాయి. అయితే అన్నింటికన్నా కూడా ఓ ఘటన మాత్రం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది.
అదే మెగా బ్రదర్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పని. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యలో ఓ ప్రత్యేక ఘటన జరిగింది. స్టేజిపై ఓ వైపు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కల్యాణ్ తో మాట్లాడుతూ.. ఇంకో వైపు ఉన్న చిరంజీవి వద్దకు వచ్చారు.
ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని మోడీ. ఇంకేముంది అక్కడి ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది. ఈ ఘటన అన్నింటికన్నా హైలెట్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అభివాదం షేక్ చేస్తోంది.