రోజా ఓటమి.. సొంత పార్టీ నేతల సంబురాలు

రోజా ఓటమి.. సొంత పార్టీ నేతల సంబురాలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చూసింది. కీలక పదవుల్లో ఉన్న నేతలు సైతం కనీసం డిపాజిట్లనూ సాధించలేకపోయారు. పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చూసింది. కీలక పదవుల్లో ఉన్న నేతలు సైతం కనీసం డిపాజిట్లనూ సాధించలేకపోయారు. పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీమంత్రి రోజా ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఆమె ఓటమితో స్థానిక వైసీపీ నేతలు కొందరు సంబురాలు చేసుకుంటున్నారు. 

దీనికి కారణం రోజా అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలు, అరాచకాలకు అడ్డూ అదుపూ లేకపోవడమేనని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఎన్నికల్లో రోజాకు తగిన బుద్ధి చెప్పారని నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కేజే శాంతి అన్నారు. బయటి నుంచి వచ్చి ఈ ప్రాంతం తన అడ్డా అన్నట్లు వ్యవహరించారని మండిపడ్డారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

నగరికి పట్టిన పీడ వదిలిందంటూ కేజే శాంతి హర్షం వ్యక్తం చేశారు. రోజాకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. రోజా ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కాగా మొదటి నుంచి పొసగని రోజా, శాంతి మధ్య సయోధ్య కుదర్చడానికి మాజీ సీఎం జగన్ ప్రయత్నించారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల్లో రోజా ఓటమి పాలయ్యారు.

Related Posts