ఇక సెలవు.. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

ఇక సెలవు.. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

తెలుగు మీడియా దిగ్గజం, అక్షరయోధుడు, ఈనాడు అధినేత రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలను నిర్వహించింది.

తెలుగు మీడియా దిగ్గజం, అక్షరయోధుడు, ఈనాడు అధినేత రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలను నిర్వహించింది. రామోజీరావు కుమారుడు కిరణ్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు.

అంతకు ముందు ఆయన అంతిమ యాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఉద్యోగులు తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంతిమ యాత్రలో రామోజీరావు పాడె మోశారు.

Read More  వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో  ఇంటింటి సర్వే