జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం ఇవాళ(మంగళవారం) ముగిసింది.

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో  ఎమ్మెల్యేల సమావేశం ఇవాళ(మంగళవారం) ముగిసింది. ఈ భేటీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌ పేరును ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా  విజయవాడలో జరగబోయే ఎన్డీయే కూటమి ఎమ్మె‍ల్యేల సమావేశానికి పవన్‌తో పాటు జనసేన ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధిష్ఠానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. కూటమిపై విశ్వాసంతో మంచి విజయాన్ని సాధించారని అభినందించారు. సీఎం ప్రమాణ స్వీకార సభకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారని తెలిపారు. రాష్ట్ర బీజేపీ తరఫున సభకు హాజరవుతున్నట్లు పురందేశ్వరి వెల్లడించారు.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

Related Posts