కాకినాడలో డయేరియా పంజా.. ఒకరి మృతి..

కాకినాడలో డయేరియా పంజా.. ఒకరి మృతి..

 

కాకినాడ జిల్లాలో ప్రస్తుతం డయేరియా పంజా విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలోని గ్రామస్తులు ప్రస్తుతం వరుసగా డయేరియా బారిన పడుతూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

దాంతో అసలు ఈ గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి అధికారులు వెళ్లారు. డీఎంహెచ్ వోతో పాటు మరికొందరు అధికారులు వెళ్లి ఈ పరిస్థితులను పరిశీలించారు. ఇక ఆ ఊరిలోని వాటర్ ట్యాంక్ లో నీటిని టెస్టింగ్ కోసం పంపించారు. దాంతో పాటు నిల్వ ఉన్న రొయ్యల కూర, మామిడి తాండ్ర లాంటివి తినడం వల్ల కూడా గ్రామస్తులకు డయేరియా సోకినట్టు తెలుస్తోంది. 

ఇక గ్రామస్తులు ఇలా డయేరియా బారిన పడటంపై స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. ఫుట్ పాయిజన్, వాటర్ పొల్యూషన్ అస్వస్థతకి కారణంగా వారు ఇలా డయేరియా బారిన పడినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వారంతా కోలుకుంటున్నట్టు ఆమె వివరించారు.

Related Posts