పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్న నారా లోకేశ్
సభా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారు నారా లోకేశ్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీలో బుధవారం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. సభా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారు నారా లోకేశ్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్ వద్దని వారిస్తున్నా నారా లోకేశ్ వినిపించుకోలేదు. సోదరసమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదంటూ ఆయన పాదాలను తాకారు. ఇది చూసిన జనసేన, టీడీపీ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియోకు మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మరీ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత నారా లోకేశ్‌పై మరింత అభిమానం పెరిగిందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం గొప్ప విషయమని అభినందిస్తున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కిన నారా లోకేష్
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2024
VC - @SURENDRAPILLEL1 pic.twitter.com/qYYFwtiq46