చికెన్ మసాల కోసం బయటకు వెళ్తే.. కిడ్నాప్ చేసి హోం గార్డుకు పెళ్లి..!

చికెన్ మసాల కోసం బయటకు వెళ్తే.. కిడ్నాప్ చేసి హోం గార్డుకు పెళ్లి..!

 

ఈ నడుమ వింతలకే వింతగా ఉండే పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. ఎక్కడైనా సరే అమ్మాయిలను ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసిన ఘటనలను చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా అబ్బాయినే ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసేశారు. ఈ వింత ఘటన బిహార్ లో జరిగింది. 

Read More నూతన వధూవరులను ఆశీర్వదించిన కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

నవ్‌గాచియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సకుచాలో సుమిత్ కుమార్ ఉంటున్నాడు. ఆయన హోంగార్డుగా శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అయితే మంగళవారం నాడు తన మేనమామ ఇంటికి వెళ్లి కోళ్లను తీసుకున్నాడు. చికెన్ మసాలా కోసం షాపుకు వెళ్లగా.. కొందరు దుండగులు వచ్చి తుపాకీని చూపించి బెదిరించి కారులో ఎక్కించుకుని వెళ్లారు. 

కిడ్నాపర్లలో గోపాల్ యాదవ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వంద కిలోమీటర్లు తీసుకెళ్లి గోపాల్ యాదవ్ కుమార్తెతో బలంవంతంగా కొట్టి మరీ పెళ్లి చేశారు. ఆ తర్వాత సుమిత్ ను మార్గమధ్యమంలో వదిలేశారు. సుమిత్ కుటుంబీకులకు ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధోబినియాకు చెందిన గోపాల్ యాదవ్, రోహిత్ యాదవ్, భిలి కుమార్, అశ్వని కుమార్‌లను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితులందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.