రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు

రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు

  • ఏపీలో ఎడతెరిపిలేని వానలు
  • అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన 

రానున్న నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటన చేసింది. సోమవారం మన్యం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

మంగళ, బుధ, గురు వారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ఒకవైపు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం, మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని తెలిపారు. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆదివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

Related Posts