ఆహారంలో విషపూరిత జెర్రీ.. తిరుపతిలో కలకలం..
ఈ నడుమ తినే ఆహారంలో రకరకాల విషపూరిత కీటకాలు, పురుగులు రావడం సలచనం రేపుతోంది. మొన్న ఐస్ క్రీమ్ లో వేలు వచ్చిన సంగతి తెలిసిందే. అది దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక దాని తర్వాత మొన్న ఓ మహిళ ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక రావడం పెద్ద సంచలనమే రేపింది.
అవి మర్చిపోక ముందే ఇప్పుడు మరో సంఘటన ఆందోళన కలిగిస్తోంది. తిరుపతిలో ఆహారంలో ఓ వ్యక్తికి విషపూరిత జెర్రి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. తిరుపతిలోని లీలామహల్ లో ఉన్న PS4 లో ఓ హోటల్ కు వెళ్లిన కస్టమర్ చపాతీలు ఆర్డర్ చేశాడు. అయితే అతనికి కూరలో విషపూరిత జెర్రీ కనిపించింది.
దాంతో వెంటనే ఆందోళన చేశాడు. ఆహార భద్రత అధికారులకు సమాచారం ఇవ్వడంతో మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు చేపట్టారు. అతని ప్లేట్ లో విషపూరిత జెర్రీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.