కౌంటింగ్‌లో అల్లర్లు సృష్టిస్తే అంతే.. పోలీసుల మాక్ డ్రిల్..!

కౌంటింగ్‌లో అల్లర్లు సృష్టిస్తే అంతే.. పోలీసుల మాక్ డ్రిల్..!

కృష్ణ జిల్లాలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేతృత్వంలో గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆందోళనలు, పోలీసుల కాల్పులు, గాయాలపాలైన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించడం వంటి వాటిపై ఈ మాక్‌ డ్రిల్‌లో కళ్లకు కట్టినట్లు అవగాహన కల్పించారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినా ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిన విషయం తెలిసిందే. వైసీపీ మూకలు టీడీపీ నేతలపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుంటంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. 

ఈ మేరకు గొడవలు, విద్వేషాలు, అల్లర్లు సృష్టిస్తే ఎలా ఉంటుందో ట్రయల్ చూపించారు. కృష్ణ జిల్లాలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేతృత్వంలో గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆందోళనలు, పోలీసుల కాల్పులు, గాయాలపాలైన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించడం వంటి వాటిపై ఈ మాక్‌ డ్రిల్‌లో కళ్లకు కట్టినట్లు అవగాహన కల్పించారు.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

Related Posts