ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
విశ్వంభర, అమరావతిః మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల అదనపు జీతం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర సీఈవో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే అమరావతి, పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అటు సచివాలయంతో పాటు హెచ్ వోడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసలుబాటు ఉంటుందని తెలిపింది.
ఇక ఈ ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా డ్యూటీలు చేయాలని తెలిపింది ప్రభుత్వం. ఇలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల గురించి తీసుకుంటున్న నిర్ణయాలు వారికి బాగానే లాభం చేస్తున్నాయి.