డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషిచేయాలి.

  WhatsApp Image 2024-07-22 at 15.40.32_c653af09విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : -డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని.. మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే  అన్నారు.  యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని సోమవారం ఎస్పి  పత్రికా ప్రకటనలో తెలిపారు. చదువుకునే వయసులో యువత చెడు వ్యసనాలకు గురికాకుండా క్రమశిక్షణతో మంచి ఆశయాలతో భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు.
యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయని ఎంతోమంది జీవితాలు మధ్యంతరంగా ముగిసిపోతున్నాయన్నారు.  మాదక ద్రవ్యాల నిర్మూలన పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి పెద్దఎత్తున విద్యార్థులకు యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడయినా గంజాయి సేవించిన, అమ్మినా, రవాణా చేసినా, ఏదేని  డ్రగ్స్ సమాచారం గురించి  తెలిస్తే సెల్ 87126 58111 కు  సమాచారం ఇవ్వాలని, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయనీ, ప్రోత్సహాకాలు అందిస్తామని ఎస్పి కిరణ్ ఖరే  పేర్కొన్నారు.