హైదరాబాద్ లో దర్శనమిస్తున్న జలకన్యలు ...

హైదరాబాద్ లో దర్శనమిస్తున్న జలకన్యలు ...

విశ్వంభర, హైదరాబాద్: జలకన్య అనగానే సగం మనిషి శరీరం, సగం చేప ఆకారం ఉంటుందని సాధారణంగా కథలలో వింటూనే ఉంటాం. అయితే అప్పుడప్పుడు సముద్ర తీరానికి జల కన్య వచ్చింది అంటూ కొన్ని రూమర్స్ కూడా చక్కర్లు కొడుతుంటాయి. జల కన్యలను కొన్ని గ్రాపిక్స్ సినిమాల్లో తప్ప ఎవరూ నేరుగా చూసింది లేదు. అయితే విదేశాల్లో ముఖ్యంగా సముద్ర ప్రాంతాలను కలిగి ఉన్న దేశాలు ప్రత్యేక ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి ఈ జలకన్యలతో ప్రదర్శన నిర్వహిస్తారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరంలో కూకట్‌పల్లిలో జల కన్యలు దర్శనమిచ్చారు. మెరైన్ పార్క్‌లో జరిగే ఎగ్జిబిషన్‌లో జల కన్యలతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్ట మొదటిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీంతో జలకన్య రూపంలో ఉన్న వారిని చూసేందుకు ప్రజలు బారులు తీరుతున్నట్లు తెలుస్తుంది. నిజమైన జల కన్యలు ఎలా ఉంటారో తెలియని వారు ప్రదర్శనలో జలకన్యల రూపంలో ఉన్న మహిళలనే నిజమైన జలకన్యలు గా భావించి సెల్ఫీలు తీసుకుంటున్నారు.

Read More విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం