కాంగ్రెస్ కి 12 నుంచి 14 సీట్లు ఖాయం... ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం! 

కాంగ్రెస్ కి 12 నుంచి 14 సీట్లు ఖాయం... ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం! 

తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో ఏకంగా 12 నుంచి 14 సీట్లు కైవసం చేసుకుంటుంది అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. భట్టి విక్రమార్క తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో దత్తాత్రేయ దేవాలయం మూడో వార్షికోత్సవంలో పాల్గొన్నారు.

ఈ వార్షికోత్సవంలో పాల్గొన్నటువంటి ఈయన ఇటీవల జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ పాలన చూసి ప్రజలందరూ కూడా తమకే ఓట్లు వేశారని ఈయన ధీమా వ్యక్తం చేశారు అంతేకాకుండా రాహుల్ గాంధీ చేసినటువంటి బస్సు యాత్ర, పాదయాత్రతో కూటమికి భయం ఏర్పడిందని తెలిపారు. 

Read More డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 22 వ వార్షికోత్సవం

ఇక ప్రజలను ఎన్నో ప్రలోభాలకు గురిచేసి, వారిని భయపెట్టినప్పటికీ ప్రజలందరూ కూడా చాలా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశారని స్పష్టంగా తెలుస్తోంది అంటూ ఈ సందర్భంగా విక్రమార్క వెల్లడించారు. ఇక జూన్ 4వ తేదీ వెళ్లడయ్యే ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అత్యధిక లోక్ స్థానాలను కైవసం చేసుకుంటుంది అంటూ ఈయన ధీమా వ్యక్తం చేశారు.