హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు

హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం హైదరాబాద్‌లో పలు రెస్టారెంట్‌లలో తనిఖీలు నిర్వహించింది.

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం హైదరాబాద్‌లో పలు రెస్టారెంట్‌లలో తనిఖీలు నిర్వహించింది. వాటిలో భాగంగా లక్డీకాపూల్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లోని తినుబండారాలను పరిశీలించింది. అపరిశుభ్రతను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ బృందం వాటిని లేబొరేటరీకి పంపడానికి నమూనాలను సేకరించింది. 

అదేవిధంగా లక్డీకాపూల్‌లోని రాయలసీమ రుచులు రెస్టారెంట్‌లో తనిఖీలు చేసిన అధికారులు ఈగలు సోకిన 20 కిలోల మైదా, పురుగులు పట్టిన రెండు కిలోల చింతపండుతో పాటు, గడువు ముగిసిన అమూల్ పాలను గుర్తించినట్లు తెలిపారు. అలాగే లైసెన్స్‌ పొందని ఓ సోడా తయారీ సంస్థకు చెందిన 168 గోలీ సోడా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. లేబుల్ లేని జీడిపప్పు, రూ.11,000 విలువైన జావర్ రోటీ సైతం తనిఖీల్లో బయటపడినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.

Read More మాస్టర్ కారింగు రవికి ఘనంగా సన్మానం