మల్లారెడ్డి భూవివాదంపై సర్వే.. భారీ పోలీసు బందోబస్తు..! 

మల్లారెడ్డి భూవివాదంపై సర్వే.. భారీ పోలీసు బందోబస్తు..! 

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భూవివాదంపై విచారణ కొనసాగుతోంది. సుచిత్రలోని 82, 83 సర్వే నంబర్లలోని స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు సంబంధిత పత్రాలను పరిశీలించి భూ సర్వే చేపట్టారు.

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భూవివాదంపై విచారణ కొనసాగుతోంది. సుచిత్రలోని 82, 83 సర్వే నంబర్లలోని స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు సంబంధిత పత్రాలను పరిశీలించి భూ సర్వే చేపట్టారు. ఎలాంటి వివాదం తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాంగ్మూలం నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయడాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రెవెన్యూ అధికారులను తప్పుబట్టారు. 13ఏళ్ల కిందట భూమి కొనుగోలు చేసి ఆస్తిపన్ను చెల్లిస్తున్నామని చెప్పారు. 2011లో తాను, మల్లారెడ్డి ఈ భూమిని కొనుగోలు చేశానని.. ఆ సమయంలో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. చట్టపరంగా రావాలని కొందరు వివాదం సృష్టిస్తున్నారని వాపోయారు. 

Read More కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమకాలిన సమస్యల పరిష్కారంపై సమీక్ష 

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమి కోర్టు వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ స్థలంలో వేసిన బారికేడ్లను నిన్న తొలగించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకోవడంతో పోలీసులు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.