చిన్నారిని చిదిమేసిన వాడిని వదిలేది లేదు.. మంత్రులు సీతక్క, శ్రీధర్ సీరియస్

చిన్నారిని చిదిమేసిన వాడిని వదిలేది లేదు.. మంత్రులు సీతక్క, శ్రీధర్ సీరియస్

 

బాధిత కుటుంబానికి రూ.2.50లక్షల ఎక్స్ గ్రేషియా
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష విధిస్తాం

 

పెద్దపల్లి రైస్ మిల్లులో చిన్నారిని చిదిమేసిన వాడిని వదిలేది లేదని మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని వారు వివరించారు. బాధితులతో మాట్లాడామని.. వారికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. 

Read More కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి  -

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఇక రైస్ మిల్లులో పనిచేస్తున్న వారి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇప్పటికే పోలీసులను ఆదేశించామని.. త్వరలోనే పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక వస్తుందని తెలిపారు. ఇక భవిష్యత్ లో తెలంగాణలో ఇలాంటి దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు మంత్రులు. బాధిత కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని తెలిపారు.

ప్రభుత్వం తరఫున రూ.2.50 లక్షలు, రైస్ మిల్లు తరఫున రూ.5లక్షలు అందిస్తామని తెలిపారు సీతక్క. దాంతో పాటు ఒకరికి ఉద్యోగం, ఇల్లు, ఉన్న చిన్న పాప చదువులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇలాంటి అఘాయిత్యాతకు గంజాయి, డ్రగ్స్ కారణం అని వివరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ ఇంకా పెంచుతామని చెప్పారు మంత్రి సీతక్క.