అమ్మకం -కొనుగోలు ఇక పై సులభతరం.
https://placeofsales.com/
వస్త్ర వ్యాపారులకు అద్భుతమైన అవకాశం..
ఇక వినియోగదారుడికే నేరుగా చేనేత వస్త్రాలు
ప్లేస్ ఆఫ్ సేల్స్ - టెక్స్ టైల్ ఆప్ తో సరిక్రొత్త ఆవిష్కరణ
మునుగోడు , విశ్వంభర :-నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామం చేనేత కుటుంభానికి చెందిన చెరుకు అజయ్ తన ఆలోచన విధానంతో సరిక్రొత్త అద్భుతమైన ఆప్ (APP) ను ఆవిష్కరించడం జరిగింది.ప్లేస్ ఆఫ్ సేల్స్ -టెక్స్ టైల్ అనే ఆండ్రాయిడ్ ఆప్ ను మొబైల్ వాడుతున్న ప్రతిఒక్కరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ప్రధానంగా చేతి వృత్తుల ద్వారా టెక్స్ టైల్ రంగానికి చెందిన వ్యాపారస్తులు , చిన్నతరహా ,కుటీర పరిశ్రమల ద్వారా వస్త్ర ఉత్పత్తి రంగాలకు చేయూతనిస్తుంది. చేనేతలు నేసిన చీరలు అమ్మలేక గిరాకి లేక మార్కెట్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చేనేత చీరలను గ్లోబల్ మార్కెట్లోకి కస్టమర్స్ కి అందుబాటులోకి తీసుకొని వచ్చారు. చేనేత కుటుంబాలనుండి వచ్చిన తను ఒక యాప్ ని తయారు చేయడం ద్వారా టెక్స్టైల్ వ్యాపారం చేసే వాళ్ళు ఈజీగా వారి యొక్క టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ను అమ్ముకోవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి ఖర్చు లేదని కేవలం ఆప్ డౌన్ లోడ్ చేసికొని మీ వ్యాపారాన్ని కొనసాగించవచ్చని ఆప్ నిర్వాహకులు తెలిపారు.
PLACE OF SALES - TEXTILE ( https://placeofsales.com/ )