గురుపూర్ణిమ వేడుకలకు ముస్తాబైన సాయి ఆలయం
...చైర్మన్ మంచి కంటి ధనుంజయ
విశ్వంభర చింతపల్లి జులై 20 : - చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపూర్ణిమ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి సాయి ఆలయాన్ని ముస్తాబు చేశామని చైర్మన్ మంచికంటి ధనంజయ తెలిపారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. చింతపల్లి శ్రీ షిరిడి సాయినాధునికి శంఖాభిషేకంతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయిబాబా ఆలయంలో ఉదయం 5:00 గంటలకు నగర సంకీర్తన, 5:30 గంటలకు కాకడ హారతి, గణపతి హోమం, 6:30 గంటలకు పంచామృతాభిషేకం, 7:30 లకు సంస్థాన్ హారతి అష్టోత్తర పూజ, 10:30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి, 11:00 గంటలకు శంకుపూజ, 12:00 గంటలకు మధ్యాహ్న హారతి, 12:30 గంటలకు భక్తులచే శంకులతో సాయినాధునికి వైభవంగా అభిషేక నిర్వహించడానికి కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5:00 గంటలకు మల్లెలతో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు సిద్దం చేసారు. ఈ కార్యక్రమాలను వేద పండితులు కొడకండ్ల శ్రీరామ శరణ్ శర్మ, శివ కిరణ్ ల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించనున్నారు. సద్గురు తత్వ ప్రచారకులు డాక్టర్ సాయి శ్రీనివాస్ ప్రవచనాలను భక్తులకు అందించనున్నారు. శంఖాభిషేకం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని చైర్మన్ మంచికంటి ధనుంజయ, ఆలయ కమిటీ సభ్యులు కోరారు.