నేను లోకల్ నన్ను గెలిపించండి. ప్రజలకు అందుబాటులో ఉంటా.. రాగిడి లక్ష్మారెడ్డి

నేను లోకల్ నన్ను గెలిపించండి. ప్రజలకు అందుబాటులో ఉంటా.. రాగిడి లక్ష్మారెడ్డి


విశ్వంభర న్యూస్:- ఎల్బీనగర్ నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు వివిధ కాలనీ అధ్యక్షులు అసోసియేషన్ సభ్యులు, అపార్ట్మెంట్ సభ్యుల మీటింగ్లో మల్కాజ్గిరి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నానని ఎన్నో సేవలు చేశానని తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికులు కారు అని తాను స్థానికుడునని నన్ను గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసింది కేసీఆర్ అయితే హైదరాబాద్ ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ ది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్న అంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహించారు. మహిళలకు 2500 రూపాయలు, వివాహానికి తులం బంగారు వస్తున్నాయా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఈనెల 13న జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

ragidi laxma reddy
మనసురాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ అధ్యక్షులు అసోసియేషన్ సభ్యులు, అపార్ట్మెంట్ సభ్యుల మీటింగ్లో పాల్మగొన్ల్కాన జ్గిరి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

Tags: