టీషర్ట్స్, జీన్స్ వద్దు...యూనిఫాం ముద్దు! టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం

టీషర్ట్స్, జీన్స్ వద్దు...యూనిఫాం ముద్దు! టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం

విశ్వంభర, వెబ్ డెస్క్ : ఆర్టీసీ ఉద్యోగులు ఇక పై జీన్స్, టీషర్ట్స్ ధరించకూడదని టీఎస్ ఆర్టీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వారు క్యాజువల్ డ్రెస్సులు వేసుకుంటున్నారని, అలాంటి వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్​ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు పరిధిలో పనిచేసే సిబ్బంది జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు అందరూ యూనిఫాం, ఫార్మల్​ డ్రెస్సులోనే విధులకు హాజరు కావాలని కోరారు.