కంటైనర్ లో ఆవులు తరలింపు…15 ఆవులు మృత్యువాత

కంటైనర్ లో ఆవులు తరలింపు…15 ఆవులు మృత్యువాత

విశ్వంభర, ప్రతినిధి : గోవులను తరలిస్తున్న ఓ కంటైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మట్టంపల్లి ఎస్. ఐ రామాంజనేయులు తెలిపిన ప్రకారం.. మంగళవారం సాయంత్రం మఠంపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా కంటైనర్ (KA 01 AN 8550) కంటైనర్ ను ఆపి చెక్ చేశారు. సూర్యాపేట నుంచి సత్య సాయి జిల్లా కదిరికి కంటైనర్ లో  26 ఎద్దులను తరలిస్తున్నారు.

కంటైనర్ లో వాటికి కుక్కడంతో 15 ఆవులు మృత్యువాత  పడ్డాయి. కంటైనర్ ను అదుపులోకి తీసుకుని చనిపోయిన 15 పశువుల హాస్పిటల్ కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రెండు గోవులకు  కాళ్లు విరుగగా, 9 గోవులను మెరుగైన చికిత్స కొరకు నల్గొండ గోశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరు నిందితులను తమిళనాడుకు చెందిన నటరాజ్, లింగస్వామిగా గుర్తించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Read More నాణ్యమైన కోతలు లేని విద్యుత్తును అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం