ముస్లింలకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి కోమటిరెడ్డి 

ముస్లింలకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి కోమటిరెడ్డి 

  • బక్రీద్ సందర్భంగా మంత్రి కీలక ప్రకటన 
  • నల్గొండ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు 

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ముస్లింలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. బక్రీద్ సందర్భంగా సోమవారం నల్గొండలోని ఈద్గా వద్ద ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని అన్నారు. 

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 30ఏళ్లు మత సామరస్యాన్ని కాపాడుతోందని చెప్పుకొచ్చారు. పేద ముస్లింలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉండేలా ఈద్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింలకు విద్యారంగంలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ద్వారా ముస్లిం యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు.

Read More గుంతలు పడిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి