ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో… ఈసీ చార్జిషీట్ పై నేడు విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో… ఈసీ చార్జిషీట్ పై నేడు విచారణ

విశ్వంభర, వెబ్ డెస్క్ : ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్​ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్​ ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్​ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఈ నెల 10న కవితపై 200 పేజీలతో కూడిన చార్జ్​ షీట్​ ను ఈడీ దాఖలు చేసిన విషయం విదితమే. ఆ చార్జ్ షీట్ లో గోవా ఆప్​ అసెంబ్లీ ప్రచారంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా చేర్చినట్లుగా తెలుస్తోంది.

లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, ఛన్ ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అర్వింద్ సింగ్ పాత్రమై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అదే ఛార్జ్​ షీట్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.

Read More శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్‌..