రానున్న నాలుగు రోజులు జాగ్రత్త.. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు
On
తెలంగాణలో నైరుతి రుతపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు రాబోయే నాలుగు రోజులు ప్రజలు ఇంకా జాగ్రత్తగా వుండాలని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కార్యక్రమంలో తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Read More మానవత్వం చాటుకున్న మహారాజు
రాబోయే నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని లోటత్తు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్ తో పాటు మల్కాజ్ గిరి, భువనగిరి, నారాయణపేట, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.