హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్, నాగోల్, కొత్తపేటలో వర్షం పడుతోంది.

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్, నాగోల్, కొత్తపేటలో వర్షం పడుతోంది. రెమాల్ తుపాను, ఉపరితల ఆవర్తనంతో..ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. 

వికారాబాద్, భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో వైపు సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Read More శ్రీకాంతాచారికి  మరణం లేదు - ఎమ్మెల్సీ మధుసూదన చారి