రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి రేవంత్ కేబినెట్ ఆమోదం

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి రేవంత్ కేబినెట్ ఆమోదం

 

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

 

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రుణమాఫీ కోసం 2023 డిసెంబర్ 9కి ముందు రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తింప చేస్తారు. దీనిపై శుక్రవారం రోజున రేవంత్ కేబినెట్ సమావేశం నిర్వహించింది.

రేవంత్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రుణమాఫీ కూడా ఉంది. అయితే డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల చేయలేకపోయారు. అందుకే ఎంపీ ఎన్నికల సమయంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇక రుణమాఫీకి రూ.39వేల కోట్లు అవసరం అవుతాయని కేబినెట్ అంచనా వేసింది. దీనికి పీఎం కిసాన్ యోజనకు వర్తింపజేస్తున్న నిబంధనలను వర్తింపజేయాలని చూస్తున్నారు. అదే జరిగితే సీఎం మొదలు ఎమ్మెల్యే వరకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను కడుతున్నవారికి రైతు భరోసా మినహాయించబోతున్నట్టు తెలుస్తోంది. దాని వల్ల ఎంత ఆదాయం మిగులుతుందనేది కూడా అధికారులు అంచనా వేయాలంటూ ఆదేశించారు సీఎం.