భూములకు జియో ట్యాగింగ్.. మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన
On
తెలంగాణలోని ఆలయాల భూములకు సంబంధించి మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. ఆలయాల భూములకు జియో ట్యాగింగ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణలోని ఆలయాల భూములకు సంబంధించి మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. ఆలయాల భూములకు జియో ట్యాగింగ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఇవాళ (మంగళవారం) బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన భూముల లెక్కలు తీసి.. తిరిగి వాటిని స్వాధీనం చేసుకోనున్నట్లు చెప్పారు. ఆధునిక పద్దతుల్లో భూ రికార్డులు నమోదు చేయనున్నట్లు ప్రకటించారు.