నాంపల్లి గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

నాంపల్లి గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

 

స్పీకర్ తో కలిసి ప్రారంభించిన మంత్రి పొన్నం  
పాల్గొన్న మేయర్, ముఖ్య నాయకులు

 

మృగశిర కార్తె ప్రారంభం కావడంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీని ప్రారంభించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు బత్తిని హరినాథ్ గౌడ్ చేప మందును వేశారు. పొన్నం ప్రభాకర్ బత్తిని కుటంబ సభ్యలును అభినందించారు.

Read More జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

మంత్రి మాట్లాడుతూ.. చాలాకాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో  ప్రజలు వేసుకుంటున్నారని.. ఇది ఆస్తమా పేషెంట్లకు బాగా పనిచేస్తుందంటూ తెలిపారు ఆయన. 150 ఏళ్లుగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయం అని ప్రశంసలు కురిపించారు. 

అస్తమా , శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఈ చేప మందు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. తన కుటుంబ సభ్యులకు కూడా వేశామని.. బాగా పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చేప మందు పంపిణీ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్మర్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.