మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్.. చెరువులో నిర్మించారంటూ ప్రహరీ కూల్చివేత

మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్.. చెరువులో నిర్మించారంటూ ప్రహరీ కూల్చివేత

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. శామీర్‌పేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చివేశారు.

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. శామీర్‌పేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు అందడంతో అధికారులు శుక్రవారం జేసీబీలతో ప్రహరీని కూల్చివేశారు.

కాగా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి కూల్చివేతలు చేపట్టారు. ఇదే పెద్దచెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను సైతం కూల్చివేశారు. గత కొన్నిరోజులుగా అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖరె రెడ్డికి చెందిన గోడలను, బిల్డింగ్‌లను అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.

Read More అద్దంకి నార్కట్ పల్లి  హైవేపై నందిపాడులో  బస్ బోల్తా - పలువురికి తీవ్ర గాయాలు