రాష్ట్రంలో భారీ వర్షం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు...!

రాష్ట్రంలో భారీ వర్షం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు...!

హైదరాబాద్‌లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 
అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు 

ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో
అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అదేవిధంగా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో వర్షం కారణంగా ఎదురయ్యే ఇబ్బందులపై కమిషనర్ రోనాల్డ్ రోస్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేయాలన్నారు. ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే రెక్టిఫై చేయాలని సూచించారు. కార్యాలయాల నుంచి వెళ్లాల్సిన ఉద్యోగులు కొంత ఆలస్యంగా బయలుదేరాలని తెలిపారు.

Read More కోటి మెటర్నటీ హాస్పిటల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ -ఆర్యవైశ్య మహాసభ

అత్యవసరం అయితేనే నగరవాసులు బయటకు రావాలని రోనాల్డ్ రోస్ చెప్పారు. మరోవైపు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.