గవర్నర్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ అవతరణ వేడుకలకు ఆహ్వానం

గవర్నర్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ అవతరణ వేడుకలకు ఆహ్వానం

రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.

రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు.కాగా జూన్ 2న తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహిస్తోంది. డిసెంబర్ 6, 2023వ తేదీన తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 

జూన్ 02, 2024న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కలిసి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధా కృష్ణన్‌ను  కలిశారు. 

Read More అద్దంకి నార్కట్ పల్లి  హైవేపై నందిపాడులో  బస్ బోల్తా - పలువురికి తీవ్ర గాయాలు 

ఆదివారం ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జూన్ 2న ఉదయం 9.30గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు, 10గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో పోలీసుల కవాతులు నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రారంభించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్‌ను ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.30గంటలకు సీఎం అక్కడికి చేరుకుటారు.