పిల్లలకు పౌష్టికాహారం అందించాలి-తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.

WhatsApp Image 2024-07-27 at 13.06.41_805f54cbవిశ్వాంబర, రంగారెడ్డి, జూలై 27 : - గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టి కాహారం అందించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోళి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం బీబీ నగర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కమిషన్ చైర్మన్ సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీచేశారు.వంటశాల గది, డైనింగ్ హాల్ను విద్యార్థులకోసం సిద్ధం చేసిన వంటలను పరిశీలించారు. పిల్లల బంగారు భవిష్యత్కసం ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాల పట్ల జిల్లా యంత్రాంగానికి మంచి అవగాహన ఉందన్నారు. నోడల్ అధికారులు తరచూ పాఠశా లలు, వసతి గృహాలు, ఆస్పత్రులను తనిఖీ చేయాలన్నారు.కలెక్టర్ హనుమంతు కే. జెండగే మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు,నోడల్ అధికారులు తరచూ తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఫుడ్ కమిషన్ సభ్యులు ఆర్.శారద,వి. ఆనంద్ మాట్లాడారు. సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె. గంగాధర్, అదనపు డీఆర్డీవో సురేష్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-07-27 at 13.06.41_72491fc8