హైదరాబాదీలకు బిగ్ అలర్ట్...ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాదీలకు బిగ్ అలర్ట్...ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

విశ్వంభర, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2024లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో చివరి లీగ్ మ్యాచ్ లో హోం టీం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది.

 ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఇవాళ ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. బోడుప్పల్, చెంగిచెర్ల, ఉప్పల్​ వైపు నుంచి భగాయత్ లే అవుట్ నుంచి నాగోల్ వైపు వచ్చే వాహనాలు, హెచ్ ఎండీఏ లే అవుట్ నుంచి బోడుప్పల్, చెంగిచెర్ల ఎక్స్ రోడ్డు వైపు వచ్చే వాహనాలు తార్నాక వైపు నుంచి ఉప్పల్ వైపు నుంచి వెళ్లాలని సూచించారు.

Read More 'సమూహ' రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి