ఈ స్థాయికి వస్తాననుకోలేదు.. బండి సంజయ్ ఎమోషనల్..

ఈ స్థాయికి వస్తాననుకోలేదు.. బండి సంజయ్ ఎమోషనల్..

 

ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్రంలో కొలువుదీరింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా.. కొత్త మంత్రులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి రావడం ఇదే కొత్త.

Read More డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 22 వ వార్షికోత్సవం

దాంతో ఆయన కుటుంబంలో సంబురాలు మొదలయ్యాయి. ఆదివారం రాష్ట్ర పతి భవన్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సంజయ్ మాట్లాడారు. నేను ఈ స్థాయికి వస్తానని అస్సల అనుకోలేదన్నా. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నరేంద్ర మోడీకి, బీజేపీ నాయక్తవానికి ధన్యవాదాలు తెలిపారు. 

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని.. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అభివృద్ధిపై దృష్టి సారించే సమయం వచ్చిందని తెలిపారు బండి సంజయ్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.