రేపే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. రోహిత్ కు గాయం..?

రేపే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. రోహిత్ కు గాయం..?

 

దాయాదుల పోరుకు సమయం దగ్గరపడుతోంది. క్రికెట్ లో అన్ని మ్యాచులు ఒక ఎత్తు అయితే.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ మరో ఎత్తు అనే చెప్పుకోవాలి. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటేనే ఇండియా మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. అన్ని మ్యాచ్ ల కంటే ఈ మ్యాచ్ నే ఎక్కువ మంది చూస్తారు. 

కాగా టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటికే మొదటి మ్యాచ్ ను ఇండియా గెలిచింది. ఇప్పుడు దాయాది పాకిస్థాన్ తో సమరానికి రెడీ అవుతోంది. రేపు ఆదివారం నాడు ఈ మ్యాచ్ ఉండబోతోంది. కాగా నిన్న సాయంత్రం ప్రాక్టీస్ మ్యాచ్ లో హిట్ మ్యాన్ బొటనవేలికి గాయం అయినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. 

ప్రాక్టీస్ పిచ్ లో బంతి రివర్స్ బౌన్స్ అవుతోందంట. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. అయితే మొన్న ఐర్లాండ్ తో మ్యాచ్ లో గాయం కారణంగానే మధ్యలోనే రోహిత్ వెనక్కు వచ్చిన సంగతి తెలిసిందే. దాయాది మ్యాచ్ లో ఇండియా కచ్చితంగా గెలవాలని దేశం మొత్తం కోరుకుంటోంది.

Related Posts